Elephants Died | విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి.. ఎక్క‌డంటే?

Elephants Died విధాత‌: హృదయాన్ని మెలిపెట్టే దృశ్యం.. మనసును కకావికలం చేసే సందర్భం… ఓ మోస్తరు కొండ సైజులో ఉండే గజరాజులు అలా నిర్జీవంగా కూలబడి ఉన్నాయి.. నిన్నా మొన్నటి వరకూ ఆ గ్రామాల చుట్టుపక్కల తిరుగుతూ అరటి.. మామిడి.. కూరగాయల పంటలు తింటూ దగ్గర్లోని వంశధార నదిలో జలకాలడే ఏనుగుల గుంపులోని నాలుగు ఏనుగులు విద్యుత్ షాక్ తో చనిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో ఈ ఘోరం జరిగింది. పొలంలోని విద్యుత్ ట్రాన్స్ […]

Elephants Died | విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి.. ఎక్క‌డంటే?

Elephants Died

విధాత‌: హృదయాన్ని మెలిపెట్టే దృశ్యం.. మనసును కకావికలం చేసే సందర్భం… ఓ మోస్తరు కొండ సైజులో ఉండే గజరాజులు అలా నిర్జీవంగా కూలబడి ఉన్నాయి.. నిన్నా మొన్నటి వరకూ ఆ గ్రామాల చుట్టుపక్కల తిరుగుతూ అరటి.. మామిడి.. కూరగాయల పంటలు తింటూ దగ్గర్లోని వంశధార నదిలో జలకాలడే ఏనుగుల గుంపులోని నాలుగు ఏనుగులు విద్యుత్ షాక్ తో చనిపోయాయి.

పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో ఈ ఘోరం జరిగింది. పొలంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తాకి నాలుగు ఏనుగులు అక్కడికక్కడే ఘీంకరిస్తూ ప్రాణాలు వదిలాయి. కాట్రగడ సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై నాలుగు ఏనుగులు మిగిలిన ఇంకో రెండు కాసేపు వీటి కళేబరాలు చుట్టూ తిరిగి బాధతో తివవ్వాకొండపైకి దారితీశాయి.

గత ఫిబ్రవరిలో ఆరు ఏనుగులు ఒరిస్సా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోకి వచ్చాయి. గుంపుగా తిరుగుతూ రైతులను హడలెత్తిస్తూ ఉండేవి. చెరుకు.. అరటి.. కూరగాయల పంటలు తినేస్తూ ఒక్కోసారి రైతులను సైతం చంపేసిన ఘటనలు ఉన్నాయి. అటవీ అధికారులు వీటిని సురక్షిత అటవీ ప్రదేశంలోకి పంపడానికి ప్రయత్నిస్తున్నా అవి మళ్లీ తిరిగి ఇటు వచ్చేస్తు ఉండేవి.

మొత్తానికి ఇప్పుడు ఒకేసారి నాలుగు గజరాజులు ప్రాణాలు విడవడం ఈ ప్రాంతవాసులను కలచివేస్తుంది. జనం అక్కడ గుమిగూడి అయ్యో అని బాధపడుతున్నారు.