Akhanda 2 | అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ .. ఇది నిర్మాత‌ల‌కి పెద్ద దెబ్బే

Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ మూవీ ‘అఖండ 2’ కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాలు, ఫుల్‌హౌస్ షోల మధ్య థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

  • By: sn |    movies |    Published on : Dec 14, 2025 12:02 PM IST
Akhanda 2 | అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ .. ఇది నిర్మాత‌ల‌కి పెద్ద దెబ్బే

Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ మూవీ ‘అఖండ 2’ కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాలు, ఫుల్‌హౌస్ షోల మధ్య థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనతో చిత్రబృందంతో పాటు బాలయ్య అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తున్న సమయంలో ఈ లీక్ జరగడం వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లీక్ అయిన HD ప్రింట్ టెలిగ్రామ్ గ్రూపులు, పలు పైరసీ వెబ్‌సైట్లలో దర్శనమివ్వడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగం వెంటనే రంగంలోకి దిగి లీక్‌కు కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ తరహా పైరసీ వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అవడం సినీ పరిశ్రమను వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడులు, వందల మంది శ్రమతో రూపొందిన సినిమాలకు ఈ పైరసీ పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమతో పాటు ప్రభుత్వం కూడా ఈ సమస్యను కఠినంగా ఎదుర్కోవాలని, అలాగే ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలోనే చూసి పరిశ్రమకు మద్దతు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని తెలుస్తుంది. ఇక ఈ సినిమా జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ఓటీటీలోకి రానుంద‌ని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.