Work | రోజుకు 17 గంట‌లు ప‌నిచేస్తున్నా.. ఉద్యోగి ట్వీట్! హైద‌రాబాద్ వైద్యుడు ఏమన్నాడంటే..?

విధాత‌: ఈ పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగం (work) చేస్తూ శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యాల‌ను కాపాడుకోవ‌డం అంద‌రికీ కుద‌ర‌ని ప‌ని. ఇదే అంశంపై తాజాగా ఓ వైద్యుడికి, ఉద్యోగికి మ‌ధ్య జ‌రిగిన ట్విట‌ర్ సంభాష‌ణ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఆ చాట్ ప్ర‌కారం.. తాను రోజుకి 17 గంట‌లు ప‌ని చేస్తున్నాన‌ని గ‌త ఆరేళ్లుగా ఇదే కొన‌సాగిస్తున్నాన‌ని 37 ఏళ్ల హ‌ర్షల్ అనే కార్పొరేట్ ఉద్యోగి ట్వీట్ చేశాడు. త‌న రక్త‌పోటు (Blood Pressure)150/90 ఉంద‌ని అందులో పేర్కొన్నాడు. […]

Work | రోజుకు 17 గంట‌లు ప‌నిచేస్తున్నా.. ఉద్యోగి ట్వీట్! హైద‌రాబాద్ వైద్యుడు ఏమన్నాడంటే..?

విధాత‌: ఈ పోటీ ప్ర‌పంచంలో ఉద్యోగం (work) చేస్తూ శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యాల‌ను కాపాడుకోవ‌డం అంద‌రికీ కుద‌ర‌ని ప‌ని. ఇదే అంశంపై తాజాగా ఓ వైద్యుడికి, ఉద్యోగికి మ‌ధ్య జ‌రిగిన ట్విట‌ర్ సంభాష‌ణ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

ఆ చాట్ ప్ర‌కారం.. తాను రోజుకి 17 గంట‌లు ప‌ని చేస్తున్నాన‌ని గ‌త ఆరేళ్లుగా ఇదే కొన‌సాగిస్తున్నాన‌ని 37 ఏళ్ల హ‌ర్షల్ అనే కార్పొరేట్ ఉద్యోగి ట్వీట్ చేశాడు. త‌న రక్త‌పోటు (Blood Pressure)150/90 ఉంద‌ని అందులో పేర్కొన్నాడు. త‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఏమైనా స‌ల‌హాలు ఇవ్వాల‌ని హైద‌రాబాద్ అపోలో హాస్పిట‌ల్స్‌ (Apollo Hospitals) కు చెందిన న్యూరాల‌జిస్ట్ డా.సుధీర్‌ను ట్యాగ్ చేశాడు.

దీనికి డాక్టర్‌ సుధీర్ స్పందించారు. వెంట‌నే ప‌నిగంట‌ల‌ను స‌గానికి స‌గం త‌గ్గించుకోవాల‌ని హ‌ర్ష‌ల్‌కు సూచించారు. అలా చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యం మెరుగుప‌డ‌టమే కాకుండా.. ఒక నిరుద్యోగికి ఉద్యోగం కూడా దొరుకుతుంద‌ని చ‌మ‌త్క‌రించారు.

దీనిపై హ‌ర్ష‌ల్ స్పందిస్తూ.. మీరు చెప్పిన విష‌యాన్ని పాటిస్తున్నాన‌ని.. అయితే త‌న బాస్ (Boss) ప‌ని ప‌ని అంటూ ఒత్తిడి చేస్తుండ‌టంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాన‌ని ట్వీట్‌లో వెల్ల‌డించాడు.

ఈ వీకెండ్ సెల‌వు కావాల‌ని బాస్‌ను అడిగా.. నీకు ప్ర‌త్యామ్నాయం వెతుక్కోగ‌ల‌న‌ని ఆమె చెప్పింది. నేను స‌రేన‌న్నాన‌ని పేర్కొన్నాడు. దీనిపై ప‌లువురు యూజ‌ర్లు స్పందించారు. త్వ‌ర‌లోనే హ‌ర్ష‌ల్‌కు మంచి ఉద్యోగం రావాల‌ని కొంద‌రు విష్ చేయ‌గా.. వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ (Work Life Balance) ఎలా చేసుకోవాలో మ‌రికొంద‌రు స‌ల‌హా ఇచ్చారు.