EMRS | ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 4,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
EMRS | దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,062 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 303 ప్రిన్సిపల్ పోస్టులు, 2266 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, అకౌంటెంట్ 361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 759, ల్యాబ్ అటెండెంట్ 373 పోస్టుల […]

EMRS | దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,062 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
303 ప్రిన్సిపల్ పోస్టులు, 2266 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, అకౌంటెంట్ 361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 759, ల్యాబ్ అటెండెంట్ 373 పోస్టుల చొప్పున నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులె 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం www.emrs.tribal.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
అర్హతలు : ప్రిన్సిపల్ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కనీసం 12 ఏండ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయసు 50 ఏండ్లకు మించరాదు. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోనేవారు బీఈడీ, పీజీ డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంఈ లేదా ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 40 ఏండ్లకు మించరాదు. అకౌంటెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. వయసు 30 ఏండ్లకు మించొద్దు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10 లేదా 12వ తరగతి పాసైతే చాలు.
ఎంపిక విధానం : ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుం : ప్రిన్సిపల్ పోస్టుకు రూ. 2 వేలు, పీజీటీ రూ. 1500, నాన్ టీచింగ్ స్టాప్ రూ. 1000 చొప్పున నిర్ణయించారు.