Medak | ప్రతి ఒక్కరూ.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
Medak | విధాత:మెదక్ బ్యూరో: ప్రాణం విలువ వేల కట్టలేనిదని, వాహనాలు నడిపే సమయాల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే ప్రమాదాల నివారించవచ్చని మెదక్ ఎమ్మెల్యేపద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది యువకులకు డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ […]

Medak |
విధాత:మెదక్ బ్యూరో: ప్రాణం విలువ వేల కట్టలేనిదని, వాహనాలు నడిపే సమయాల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే ప్రమాదాల నివారించవచ్చని మెదక్ ఎమ్మెల్యేపద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
బుధవారం మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది యువకులకు డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ వల్ల బహుళపయోజనాలు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఉమర్, నాయకులు జుబేర్ తదితరులు ఉన్నారు.