Ex Central Minister | చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలి: బలరాం నాయక్
Ex Central Minister బీజేపీ ఎంపీ సోయం బాపు రావుకు హితువు పలికిన మాజీ కేంద్ర మంత్రి విధాత: బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మండిపడ్డారు. చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలని ఎంపీ సోయం బాపు రావుకు హితువు పలికారు. లంబాడీ, కోయ కమ్యూనిటీలపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఈ రెండు తెగలు వేరు వేరు కాదని, రాజ్యాగం సవరణ చేశాక లంబాడీ లను […]

Ex Central Minister
బీజేపీ ఎంపీ సోయం బాపు రావుకు హితువు పలికిన మాజీ కేంద్ర మంత్రి
విధాత: బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మండిపడ్డారు. చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలని ఎంపీ సోయం బాపు రావుకు హితువు పలికారు. లంబాడీ, కోయ కమ్యూనిటీలపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఈ రెండు తెగలు వేరు వేరు కాదని, రాజ్యాగం సవరణ చేశాక లంబాడీ లను ఎస్టీ జాబితాలో కలిపారని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్స్ నుంచి లంబాడీ కమ్యూనిటీని తొలగించడం సాధ్యం కాదన్నారు. అలా చేయాలంటే.. దేశంలో 21 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ రావాలి అదేవిధంగా అసెంబ్లీల తీర్మానాలు కావాలన్నారు. ఇప్పుడు దేశంలో ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ బలరాం నాయక్ ప్రశ్నించారు.
సోయం బాపు రావు మాటలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని బలరాం నాయక్ అన్నారు. ఆయన మాటలు విని ఎస్టీ నాయకులకు అవగాహన లేదని అందరూ అనుకుంటున్నారన్నారు. అందుకే ఏం మాట్లాడాలన్నా అవగాహనతో మాట్లాడాలని మాజీ కేంద్ర మంత్రి సూచించారు. పార్లమెంటు సభ్యునిగా ఉండి సోయం బాపు రావు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి సబ్ ప్లాన్ నిధులు ఎన్ని వస్తున్నాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగే దమ్ము సోయం బాపు రావు కు ఉంన్నదా అని బలరాం నాయక్ ప్రశ్నించారు.