• Telugu News
  • /Latest

Narayana | మాజీ మత్రి నారాయణపై లైంగిక ఆరోపణలు.. మరదలు ప్రియకు పిచ్చంట

Ex Minister Narayana విధాత‌: నిన్న మొన్నా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టిడిపి మాజీ మంత్రి , నారాయణ కాలేజీల చైర్మన్ నారాయణ లైంగిక ఆరోపణను వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నారాయణ తన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య మరదలు ప్రియ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో , లైంగికంగా ఎలా వేధించారో తెలుపుతూ ప్రియా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. అవి ఏకంగా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు. […]

Reported by: krs | latest | IST
Read Time: 5 mins
Narayana | మాజీ మత్రి నారాయణపై లైంగిక ఆరోపణలు.. మరదలు ప్రియకు పిచ్చంట

Ex Minister Narayana

విధాత‌: నిన్న మొన్నా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టిడిపి మాజీ మంత్రి , నారాయణ కాలేజీల చైర్మన్ నారాయణ లైంగిక ఆరోపణను వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నారాయణ తన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య మరదలు ప్రియ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారో , లైంగికంగా ఎలా వేధించారో తెలుపుతూ ప్రియా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. అవి ఏకంగా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.

నారాయణ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు. పిల్లల ఆత్మహత్యల గురించి సైతం తానూ వివరిస్తాను అని ఆమె చేసిన ప్రకటన నారాయణ గ్రూప్ కాలేజీల ప్రతిష్టకు ఇబ్బంది కలిగించింది. అయితే నేడు ప్రియ భర్త సుబ్రహ్మణ్యం ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ప్రియకు పిచ్చి ఉందని, మానసికంగా సరిగాలేరని దానికి సైతం చికిత్స తీసుకుంటున్నారని, ఆమె చేసిన ప్రకటనలు, మాటలు, పోస్టింగులన్నీ ఆమెకు తెలియక, చేసినవేన‌ని అయన వివరించారు.

ఇదిలా ఉండగా తమకు , తమ ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని గుర్తించిన మరుక్షణమే టీడీపీ నాయకులు, పెద్దలు లైన్లోకి వస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అప్పట్లో తన ఇంటిలో సెక్యూరిటీ గార్డులు ఇద్దరినీ కాల్చి చంపిన బాలకృష్ణ సైతం కేసునుంచి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని బయటపడ్డారు. ఇప్పుడు కూడా ప్రియా పొంగూరుకు పిచ్చి ఉండదని, అందుకే ఆమె ఏదేదో మాట్లాడుతున్నారని ఆమె భర్త, నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పడం దీనికి మరో ఉదాహరణ అని వైసిపి ఆరోపిస్తోంది.

వీరమహిళకు సేనాని సాయం చేస్తారా ?

ప్రియ పొంగూరు జనసేన సానుభూతిపరురాలు అని అంటున్నారు. గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినపుడు ప్రియ ఆయనకు మద్దతుగా పోస్టింగులు పెట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశం మీద పవన్ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలకు ప్రియా మద్దతు తెలుపుతూ పవన్ అడిగిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టర్, ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

మరి తనకు మద్దతుగా నిలిచిన మహిళా ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదా? లేక నారాయణ తమకు మొదటి నుంచి కుటుంబ మిత్రుడు కాబట్టి దాని గురించి మాట్లాడడం అనవసరం అని పవన్ భావిస్తున్నారా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే.. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పొంగూరు కృష్ణప్రియ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది.