Srinagar | ఉగ్ర కుట్ర భ‌గ్నం.. శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపే పేలుడు ప‌దార్థాలు నిర్వీర్యం

Srinagar | జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఉగ్ర‌దాడికి ముష్క‌రులు కుట్ర ప‌న్నారు. కానీ ఆ కుట్ర‌ను భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌సిగ‌ట్టి నిర్వీర్యం చేశాయి. శ్రీన‌గ‌ర్ - బారాముల్లా హైవేపై అమ‌ర్చిన పేలుడు ప‌దార్థాల‌ను నిర్వీర్యం చేశారు. శ్రీన‌గ‌ర్ - బారాముల్లా హైవేపై ఉన్న జంగం ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద పేలుడు ప‌దార్థాల‌ను సోమ‌వారం ఉద‌యం బ‌ల‌గాలు గుర్తించారు. దీంతో ఇరు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. హుటాహుటిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను అక్క‌డికి ర‌ప్పించారు. అనంత‌రం పేలుడు ప‌దార్థాల‌ను […]

Srinagar | ఉగ్ర కుట్ర భ‌గ్నం.. శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపే పేలుడు ప‌దార్థాలు నిర్వీర్యం

Srinagar | జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ ఉగ్ర‌దాడికి ముష్క‌రులు కుట్ర ప‌న్నారు. కానీ ఆ కుట్ర‌ను భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌సిగ‌ట్టి నిర్వీర్యం చేశాయి. శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపై అమ‌ర్చిన పేలుడు ప‌దార్థాల‌ను నిర్వీర్యం చేశారు.

శ్రీన‌గ‌ర్ – బారాముల్లా హైవేపై ఉన్న జంగం ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద పేలుడు ప‌దార్థాల‌ను సోమ‌వారం ఉద‌యం బ‌ల‌గాలు గుర్తించారు. దీంతో ఇరు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. హుటాహుటిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను అక్క‌డికి ర‌ప్పించారు. అనంత‌రం పేలుడు ప‌దార్థాల‌ను నిర్వీర్యం చేశారు.

అయితే ఈ హైవేపై ప్ర‌తి రోజు ఉద‌యం భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాన్వాయ్‌లు వెళ్తుంటాయి. ఈ క్ర‌మంలో భార‌త జ‌వాన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ పేలుడు ప‌దార్థాల‌ను అమ‌ర్చి ఉండొచ్చ‌ని సీఆర్పీఎఫ్ అధికారులు భావిస్తున్నారు. పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మైన ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హించారు. ఉగ్ర‌వాదుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.