TSPSC కీలక నిర్ణయం.. గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగింపు
విధాత: TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -4 దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ. దీంతో ఇవాళ ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తుల గడువు తేదీని పొడిగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ సూచించింది. 8180 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం […]

విధాత: TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -4 దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ. దీంతో ఇవాళ ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తుల గడువు తేదీని పొడిగించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ సాయంత్రం 5 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
8180 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి.
సోమవారం ఒక్కరోజే 34,247 దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గత డిసెంబర్ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.