Amritpal Singh | అమృతపాల్‌లో ఎన్నో శృంగార కోణాలు.. వెలుగులోకి ఆసక్తికర కథనం..
Amritpal Singh | ఖలీస్తానీ నేత( Khalistani Leader ) అమృత్‌పాల్ సింగ్‌లో ఎన్నో శృంగార కోణాలు ఉన్నట్లు ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. గత ఆరు రోజుల నుంచి పరారీలో ఉన్న అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు( Punjab Police ) వేట కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమృత్ పాల్( Amritpal Singh ) వివాహేతర సంబంధాలు, వీడియో కాల్స్‌లో ముద్దులు, చాటింగ్ వంటి విషయాలు బయటకు వచ్చాయి. ఒంటరి మహిళలు, వివాహితలను లక్ష్యంగా […]

Amritpal Singh | ఖలీస్తానీ నేత( Khalistani Leader ) అమృత్‌పాల్ సింగ్‌లో ఎన్నో శృంగార కోణాలు ఉన్నట్లు ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. గత ఆరు రోజుల నుంచి పరారీలో ఉన్న అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు( Punjab Police ) వేట కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమృత్ పాల్( Amritpal Singh ) వివాహేతర సంబంధాలు, వీడియో కాల్స్‌లో ముద్దులు, చాటింగ్ వంటి విషయాలు బయటకు వచ్చాయి.
ఒంటరి మహిళలు, వివాహితలను లక్ష్యంగా చేసుకున్న అమృత్ పాల్ వారితో వివాహేతర( extramarital ) సంబంధాలు పెట్టుకున్నట్లు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో కథనాలు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా వారితో పరిచయం పెంచుకుని, ఆశ్లీల వీడియోలను అడ్డంగా పెట్టుకుని, మహిళలను బెదిరించి సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడైంది.
అమృత్‌పాల్‌కు సంబంధించిన 12 వాయిస్ నోట్స్ బయటకు వచ్చాయి. అయితే మహిళలతో క్యాజువల్ రిలేషన్ షిప్ పెట్టుకుంటున్నట్టు, వాటిని సీరియస్‌గా తీసుకోవద్దని ఒక వాయిస్ నోట్‌లో బయటపడింది. మహిళలు త్వరగా సీరియస్ అవుతారని, మరో దాంట్లో.. మహిళ వివాహా బంధానికి ఇబ్బంది రానంత వరకు తనకు వివాహేతర సంబంధం సమస్య కాదని ఓ మహిళతో అమృత్‌పాల్ మాట్లాడిన వాయిస్ బయటకు వచ్చింది.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత్‌పాల్‌కు మహిళలే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఓ మహిళతో జరిపిన సంభాషణ బయటకు వెల్లడైంది. మన వివాహేతర సంబంధం కన్ఫార్మ్ అయింది. మన హానీమూన్ దుబాయ్‌లో ఉందని రాసుకొచ్చాడు. సదరు మహిళ లాఫింగ్ ఎమోజీలను షేర్ చేసింది.