Punjab | బిడ్డ‌ను చంపి.. బైక్‌కు క‌ట్టి ఈడ్చుకెళ్లిన తండ్రి

సీసీకెమెరాలో న‌మోదు.. స్థానికుల దిగ్భ్రాంతి పంజాబ్‌లో ప‌రువు హ‌త్య.. కేసు న‌మోదు Punjab | విధాత‌: పంజాబ్‌లో మ‌రో కులోన్మాద హ‌త్య జ‌రిగింది. బిడ్డ ప‌ట్ల క‌న్న‌తండ్రి వ్య‌వ‌హ‌రించిన తీరు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక యువ‌కుడితో ఇంట్లో చెప్ప‌కుండా వెళ్లి మ‌రుస‌టి రోజు వ‌చ్చిన బిడ్డ‌ను తండ్రి చంపేశాడు. అనంత‌రం యువ‌తి మృతదేహాన్ని త‌న బైకుకు క‌ట్టుకొని ఈడ్చుకెళ్లి రైలు ప‌ట్టాల‌పై ప‌డేసిన ఘ‌ట‌న గ్రామ‌స్థుల‌ను షాక్ గురిచేసింది. అమృత్‌సర్ (Amritsar) లోని ముచ్చల్ గ్రామంలో […]

Punjab | బిడ్డ‌ను చంపి.. బైక్‌కు క‌ట్టి ఈడ్చుకెళ్లిన తండ్రి
  • సీసీకెమెరాలో న‌మోదు.. స్థానికుల దిగ్భ్రాంతి
  • పంజాబ్‌లో ప‌రువు హ‌త్య.. కేసు న‌మోదు

Punjab | విధాత‌: పంజాబ్‌లో మ‌రో కులోన్మాద హ‌త్య జ‌రిగింది. బిడ్డ ప‌ట్ల క‌న్న‌తండ్రి వ్య‌వ‌హ‌రించిన తీరు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక యువ‌కుడితో ఇంట్లో చెప్ప‌కుండా వెళ్లి మ‌రుస‌టి రోజు వ‌చ్చిన బిడ్డ‌ను తండ్రి చంపేశాడు. అనంత‌రం యువ‌తి మృతదేహాన్ని త‌న బైకుకు క‌ట్టుకొని ఈడ్చుకెళ్లి రైలు ప‌ట్టాల‌పై ప‌డేసిన ఘ‌ట‌న గ్రామ‌స్థుల‌ను షాక్ గురిచేసింది. అమృత్‌సర్ (Amritsar) లోని ముచ్చల్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

ముచ్చల్ (Muchal) గ్రామానికి చెందిన ఓ అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చింది. త‌మ అభిప్రాయానికి విరుద్ధంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయింద‌ని బిడ్డ‌ను తండ్రి చంపేశాడు.

అనంత‌రం త‌న ద్విచ‌క్ర వాహ‌నానికి ఆమె కాలును తాడుతో క‌ట్టేసి వేగంగా ఈడ్చుకెళ్లాడు. రైలు ప‌ట్టాల‌పై మృత‌దేహాన్ని ప‌డేశాడు. స్పీడ్‌గా ఈడ్చుకెళ్తున్న‌ఘ‌ట‌న రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. మృతదేహాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.