Nirmal: ఇంట్లో తండ్రి శవం.. కొడుకు పరీక్ష హాల్లో
చదువు పట్ల తక్కళ్ల రోహిత్ పట్టుదల విధాత: తండ్రి దూరమవడం కన్నా దుఃఖం ఏమీ ఉండదు! అంతటి దుఃఖంలోనూ తన మనోనిబ్బరాన్ని చాటాడు పదో తరగతి విద్యార్థి తక్కళ్ల రోహిత్! ఒకవైపు కన్నీరు కారుతున్నా.. ఆ కన్నీరు.. భవిష్యత్తులో తన తండ్రికి నిజమైన నివాళిగా మారుతుందనే పట్టుదలతో తండ్రి శవం ఇంటి ముందు ఉన్నా.. వెళ్లి పరీక్ష రాశాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం మొర్రిగూడెం గ్రామానికి చెందిన రోహిత్ తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హాస్పిటల్‌లో […]

- చదువు పట్ల తక్కళ్ల రోహిత్ పట్టుదల
విధాత: తండ్రి దూరమవడం కన్నా దుఃఖం ఏమీ ఉండదు! అంతటి దుఃఖంలోనూ తన మనోనిబ్బరాన్ని చాటాడు పదో తరగతి విద్యార్థి తక్కళ్ల రోహిత్! ఒకవైపు కన్నీరు కారుతున్నా.. ఆ కన్నీరు.. భవిష్యత్తులో తన తండ్రికి నిజమైన నివాళిగా మారుతుందనే పట్టుదలతో తండ్రి శవం ఇంటి ముందు ఉన్నా.. వెళ్లి పరీక్ష రాశాడు.
నిర్మల్ జిల్లా కడెం మండలం మొర్రిగూడెం గ్రామానికి చెందిన రోహిత్ తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఒకవైపు పరీక్షలు.. మరోవైపు ఇంటి ముందు తండ్రి శవం.
ఈ స్థితిలో గుండె రాయి చేసుకుని.. ఉదయం 9.30 గంటలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షకు హాజరయ్యాడు రోహిత్. ఇది చదువు పట్ల రోహిత్‌కు ఉన్న శ్రద్దకు, పట్టుదలకు నిదర్శనమని ఉపాధ్యాయులు కొనియాడారు.