Nalgonda | ఖరీఫ్ రైతాంగానికి ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలి: జూలకంటి రంగారెడ్డి

Nalgonda అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విధాత: ఖరీఫ్‌లో రైతాంగానికి అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని, అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం నల్లగొండ పార్టీ కార్యాలయంలో బండ శ్రీశైలం అధ్యక్షతన జరిగింది. […]

Nalgonda | ఖరీఫ్ రైతాంగానికి ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలి: జూలకంటి రంగారెడ్డి

Nalgonda

  • అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి
  • మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

విధాత: ఖరీఫ్‌లో రైతాంగానికి అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని, అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం నల్లగొండ పార్టీ కార్యాలయంలో బండ శ్రీశైలం అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ది ఉత్సవాల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు అమలు చేస్తున్నారో చెప్పాలని కోరారు.

రబీలో పండించిన వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నప్పటికీ, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని అన్నారు. ఐకెపి కేంద్రాలలో తూకం వేసినప్పటికీ మిల్లర్లు క్వింటాల్ కి రెండు నుండి పది కేజీల వరకు తూకం తీశారని దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖరీఫ్ లో పెట్టుబడికి అవసరమైన పంట రుణాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఏకకాలంలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చెయ్యకపోవడంతో తీసుకున్న అసలు అంత వడ్డీ అయిందని గుర్తు చేశారు. ధరణిలో తలెత్తుతున్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గిరిజనులు అటవీ

భూములను సేద్యం చేసుకుంటున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోడు భూముల పట్టాలు ఇచ్చి వారికి కూడా పంట రుణాలు ఇవ్వాలని, రైతుబంధును కూడా వర్తింప చేయాలన్నారు. కౌలు రైతులకు కూడా పంట రుణాలను ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును పంట రుణాల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని కోరారు.

ఖరీఫ్ లో కృష్ణ నది పరివాహక ప్రాంతంలోని ఆయకట్టు రైతాంగం సేద్యం చేయడానికి సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని అంచనా వేసి అందుకు అనుగుణంగా నీటి పంపిణీ చేసి సాగర్ అయకట్టు పరిధిలో ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు నీటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత కార్యకలాపాలను సమీక్షించి ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన పంట రుణాలు అందించే విధంగా బ్యాంకర్లపై ఒత్తిడి పెంచడానికి రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలను చేయాలన్నారు. ఎరువులు విత్తనాలను ఎవరైనా బ్లాక్ చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వ్యవసాయ కార్మికులకు వెంటనే బకాయి వేతనాలను ఇవ్వాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో పాఠశాలలు ప్రారంభించే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకలతోపాటు నోట్ పుస్తకాలు కూడా ఇవ్వాలన్నారు. ప్రవేట్ విద్యాసంస్థల ఫీజులను అరికట్టాలన్నారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికారి మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హశం, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.