Hyderabad | చికెన్ వ‌డ్డించ‌లేద‌ని కొట్లాట‌.. నిలిచిపోయిన‌ వివాహం..

Hyderabad | పెళ్లంటే నూరేళ్ల పంట‌. జీవితంలో ఒకేసారి జ‌రిగే ఈ వివాహ వేడుక‌ను గొప్ప‌గా, ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ క‌ల కంటారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో పెళ్లి స‌మ‌యానికి ఏవో స‌మ‌స్య‌లు చుట్టుముడుతాయి. క‌ట్నం చాల‌లేద‌ని గొడ‌వ చేయ‌డంతో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోతాయి. లేదంటే స‌రిగ్గా ముహుర్తం స‌మ‌యానికి ప్రేమ వ్య‌వ‌హారాలు తెలియ‌డంతో ఆగిపోయిన పెళ్లిళ్లు చూశాం. కానీ ఈ పెళ్లి మాత్రం చికెన్ వ‌డ్డించ‌లేద‌ని ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని షాపూర్‌న‌గ‌ర్‌లో వెలుగు […]

Hyderabad | చికెన్ వ‌డ్డించ‌లేద‌ని కొట్లాట‌.. నిలిచిపోయిన‌ వివాహం..

Hyderabad | పెళ్లంటే నూరేళ్ల పంట‌. జీవితంలో ఒకేసారి జ‌రిగే ఈ వివాహ వేడుక‌ను గొప్ప‌గా, ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ క‌ల కంటారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో పెళ్లి స‌మ‌యానికి ఏవో స‌మ‌స్య‌లు చుట్టుముడుతాయి. క‌ట్నం చాల‌లేద‌ని గొడ‌వ చేయ‌డంతో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోతాయి.

లేదంటే స‌రిగ్గా ముహుర్తం స‌మ‌యానికి ప్రేమ వ్య‌వ‌హారాలు తెలియ‌డంతో ఆగిపోయిన పెళ్లిళ్లు చూశాం. కానీ ఈ పెళ్లి మాత్రం చికెన్ వ‌డ్డించ‌లేద‌ని ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని షాపూర్‌న‌గ‌ర్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌గ‌ద్గిరిగుట్ట రింగ్ బ‌స్తీకి చెందిన యువ‌కుడికి కుత్బుల్లాపూర్‌కు చెందిన అమ్మాయితో సోమ‌వారం తెల్ల‌వారుజామున పెళ్లి జ‌ర‌గాల్సి ఉండే. ఈ క్ర‌మంలో షాపూర్‌న‌గ‌ర్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్లో ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. అయితే అమ్మాయి కుటుంబీకులు బీహార్‌కు చెందిన మ‌ర్వాడీలు కావ‌డంతో కేవ‌లం శాఖాహారం భోజ‌నం మాత్ర‌మే ఏర్పాటు చేశారు.

ఇక చివ‌ర్లో ఫంక్ష‌న్ హాల్‌కు చేరుకున్న వ‌రుడి దోస్తులు.. త‌మ‌కు చికెన్ ఎందుకు వ‌డ్డించ‌డం లేద‌ని గొడ‌వ పెట్టుకున్నారు. దీంతో వ‌ధువు కుటుంబ స‌భ్యులకు, వ‌రుడికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పెళ్లి ఆగిపోయింది. చేసేదేమీ లేక వ‌ధువు త‌ర‌ఫు వారు జీడిమెట్ల పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇరు కుటుంబాల‌కు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. ఈ నెల 30న వివాహం చేయాల‌ని నిర్ణ‌యించారు.