Srisailam | శ్రీశైలంలో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 దుకాణాలు ద‌గ్ధం

Srisailam | శ్రీశైలంలో బుధ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. ల‌లితాంబికా దుకాణంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఎల్ బ్లాక్ స‌ముదాయంలో మంట‌లు వ్యాపించాయి. ప్ర‌మాదం కార‌ణంగా 15 దుకాణాలు కాలిబూడిద‌య్యాయి. దుకాణాల య‌జ‌మానులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న సిబ్బంది.. మంట‌ల‌ను అదుపు చేసింది. శ్రీశైలం దేవ‌స్థానం ఈవో ల‌వ‌న్న ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు రూ.2 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే […]

  • By: raj    latest    Aug 31, 2023 6:05 AM IST
Srisailam | శ్రీశైలంలో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 దుకాణాలు ద‌గ్ధం

Srisailam |

శ్రీశైలంలో బుధ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. ల‌లితాంబికా దుకాణంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఎల్ బ్లాక్ స‌ముదాయంలో మంట‌లు వ్యాపించాయి. ప్ర‌మాదం కార‌ణంగా 15 దుకాణాలు కాలిబూడిద‌య్యాయి.

దుకాణాల య‌జ‌మానులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న సిబ్బంది.. మంట‌ల‌ను అదుపు చేసింది. శ్రీశైలం దేవ‌స్థానం ఈవో ల‌వ‌న్న ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని ప‌రిశీలించారు.

ఈ ఘ‌ట‌న‌లో సుమారు రూ.2 కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.