Khammam | కాటన్ మార్కెట్ యార్డులో మంటలు.. కాలి బూడిదైన 1500 కాటన్ బ్యాగులు
గత రెండు నెలలుగా నిల్వ ఉన్న స్టాట్ విధాత: ఖమ్మం (Khammam) కాటన్ మార్కెట్ యార్డులో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల మధ్యలో ఒక్కసారిగా రెండు షెడ్‌లలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఫైర్ ఇంజన్ రావడంలో కొంత జాప్యం జరిగిన కారణంగా మంటలు అదుపులోకి రాలేదని మార్కెట్ అధికారులు వెల్లడించారు. అయితే మొత్తం 3 ఫైరింజన్‌ల ద్వారా అగ్నిమాపక […]

- గత రెండు నెలలుగా నిల్వ ఉన్న స్టాట్
విధాత: ఖమ్మం (Khammam) కాటన్ మార్కెట్ యార్డులో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల మధ్యలో ఒక్కసారిగా రెండు షెడ్‌లలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.
వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఫైర్ ఇంజన్ రావడంలో కొంత జాప్యం జరిగిన కారణంగా మంటలు అదుపులోకి రాలేదని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
అయితే మొత్తం 3 ఫైరింజన్‌ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
మార్కెట్ యార్డులోని షెడ్‌లలో గత రెండు నెలలుగా నిల్వ ఉన్న సుమారు 1500 కాటన్ బ్యాగులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, వీటి విలువ సుమారు రూ.15లక్షల వరకు ఉంటుందని మార్కెట్ అధికారులు తెలిపారు.