అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్‌లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాయిలేగ్‌లోని న్యూజ్ రివర్ గ్రీన్‌వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్‌విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు. అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు […]

విధాత : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్తో కరోనలినా రాజధాని రాలేయిగ్‌లో ఓ దుండగులు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయిలేగ్‌లోని న్యూజ్ రివర్ గ్రీన్‌వేకు సమీపంలో కాల్పులు జరిగినట్లు స్థానిక మేయర్ మేరి అన్ బల్ద్‌విన్ ధృవీకరించారు. కాల్పులు జరగడం దురదృష్టకరమన్నారు.
అయితే పౌరులపై ఓ తెల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన వెంటనే స్థానికంగా ఉన్న గ్యారేజీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఆ గ్యారెజీని పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడిని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటన కేసులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.