Uttarakhand | ఐదుగురు కేదర్‌నాథ్ యాత్రికుల మృతి
ఉత్తరాఖండ్‌లో రహదారిపై వెళ్తున్న కారుపై కూలిన భారీ కొండచరియలు ఉత్తరాఖండ్‌ను వదలని వానలు ఈ సీజన్ వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 58 మంది దుర్మరణం, 19 మంది గల్లంతు Uttarakhand | విధాత: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో కారుపై కొండచరియలు ఒక్కసారిగా కూలిపడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి గుప్తకాశీ-గౌరీకుండ్ హైవేపై ఫాటా సమీపంలోని తర్సాలి వద్ద కొండచరియలు విరిగిపడి 60 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అదే సమయంలో ఐదుగురు భక్తులు కేదార్‌నాథ్ (Kedarnath) […]
- ఉత్తరాఖండ్‌లో రహదారిపై వెళ్తున్న
- కారుపై కూలిన భారీ కొండచరియలు
- ఉత్తరాఖండ్‌ను వదలని వానలు
- ఈ సీజన్ వివిధ ఘటనల్లో ఇప్పటివరకు
- 58 మంది దుర్మరణం, 19 మంది గల్లంతు
Uttarakhand | విధాత: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో కారుపై కొండచరియలు ఒక్కసారిగా కూలిపడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి గుప్తకాశీ-గౌరీకుండ్ హైవేపై ఫాటా సమీపంలోని తర్సాలి వద్ద కొండచరియలు విరిగిపడి 60 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది.
అదే సమయంలో ఐదుగురు భక్తులు కేదార్‌నాథ్ (Kedarnath) కు కారులో వెళుతుండగా, ఫాటా -సోన్‌ప్రయాగ్ మధ్య ఉన్న పర్వతం నుంచి రాళ్లు, బండరాళ్లు కారుపై పడ్డాయి. కారు మొత్తం లోయలోకి పడిపోయింది. కారుపై బండరాళ్లు మట్టిదిబ్బలు నిండిపోయాయి. ఐదుగురు కారులోనే చనిపోయారు.
విషయం తెలుసుకున్నఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. శుక్రవారం ఐదు మృతదేహాలను వెలికి తీశాయి. మృతుల్లో ముగ్గురు గుజరాత్, మరో ఇద్దరు హరిద్వార్‌కు చెందినవారిగా గుర్తించారు. తుక్కుతుక్కుగా మారిన వారు ప్రయాణించిన కారును బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.
ఇప్పటివరకు 58 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు శుక్రవారం భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కొండ ప్రాంతంలో వచ్చే మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్‌ను జారీచేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డాటా ప్రకారం.. ఈ వర్షాకాలంలో వివిధ సంఘటనల్లో ఇప్పటివరకు 58 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. మరో 19 మంది గల్లంతయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram