Godavari | భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం.. 56 అడుగుల‌కు నీటిమ‌ట్టం

Godavari | భద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపం దాల్చింది. గంట గంట‌కూ గోదావ‌రి ఉధృతి పెరుగుతోంది. శ‌నివారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో గోదావ‌రి నీటిమ‌ట్టం 56 అడుగుల‌కు చేరింది. దీంతో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్ ప్రియాంక ఆల మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీ చేశారు. మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో భ‌ద్రాచ‌లం నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోక‌ల‌ను అధికారులు నిలిపివేశారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని సమీక్షిస్తున్నారు. లోత‌ట్టు […]

Godavari | భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం.. 56 అడుగుల‌కు నీటిమ‌ట్టం

Godavari | భద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపం దాల్చింది. గంట గంట‌కూ గోదావ‌రి ఉధృతి పెరుగుతోంది. శ‌నివారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో గోదావ‌రి నీటిమ‌ట్టం 56 అడుగుల‌కు చేరింది. దీంతో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్ ప్రియాంక ఆల మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీ చేశారు.

మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో భ‌ద్రాచ‌లం నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోక‌ల‌ను అధికారులు నిలిపివేశారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని సమీక్షిస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు.

వరదల నేపథ్యంలో అధికారులు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం ప్రధాన మార్గం, భద్రాచలం- చింతూరు ప్రధాన మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు.

బూర్గంపహాడ్‌ మండలంలోని సారపాక- నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్‌-వేలేరు, ఇరవెండి- అశ్వాపురం రహదారుల పైకి గోదావరి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ముంపు ప్రాంతాలకు చెందిన 10 వేల మంది గ్రామస్తులను 10కు పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు.