సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు

  • By: Somu    latest    Dec 30, 2023 10:03 AM IST
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

విధాత : సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆరెస్‌. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్‌రెడ్డిని కలిసిన నళిని పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు.


అయితే ఆమె తాను సనాతన ధర్మ మార్గంలో పయనిస్తున్నానని, ఉద్యోగంపై ఆసక్తి లేదని, కుదిరితే సనాతన ధర్మ ప్రచారానికి సహాయం చేయాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలోనే నళిని ఈరోజు సచివాలయంలో రేవంత్‌రెడ్డిని కలువడం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భంగా నళిని పలు ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు తాను రాసిన పుస్తకాలను ఆయనకు అందించారు.