Former JD Lakshminayana | రైతుగా మారిన మాజీ జేడీ లక్ష్మీనాాయణ
Former JD Lakshminayana | గుంటూరు జిల్లా తెనాలి మండలం అత్తోట గ్రామంలోని భూమి భారతి వ్యవసాయ క్షేత్రంలో జేడీ లక్ష్మీనారాయణ రైతులా దర్శనమిచ్చారు. నాట్లు వేశారు, వ్యవసాయ క్షేత్రంలోనే మిగతా రైతులతో ఆటపాట చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఫ్యాంట్ షర్టులతో కనిపించే జేడీ లక్ష్మీనారాయణ అచ్చ తెలుగు రైతులా తల పాగా, లుంగీ, బనియన్, టవల్ ధరించి వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేస్తుంటే ఎవరూ గుర్తించ లేని విధంగా తయారయ్యారు. అత్తోట గ్రామ రైతులు గ్రామస్తులు […]
Former JD Lakshminayana |
గుంటూరు జిల్లా తెనాలి మండలం అత్తోట గ్రామంలోని భూమి భారతి వ్యవసాయ క్షేత్రంలో జేడీ లక్ష్మీనారాయణ రైతులా దర్శనమిచ్చారు. నాట్లు వేశారు, వ్యవసాయ క్షేత్రంలోనే మిగతా రైతులతో ఆటపాట చేస్తూ ఉల్లాసంగా గడిపారు.
ఫ్యాంట్ షర్టులతో కనిపించే జేడీ లక్ష్మీనారాయణ అచ్చ తెలుగు రైతులా తల పాగా, లుంగీ, బనియన్, టవల్ ధరించి వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేస్తుంటే ఎవరూ గుర్తించ లేని విధంగా తయారయ్యారు. అత్తోట గ్రామ రైతులు గ్రామస్తులు పిల్లలతో హాయిగా గడిపారు.
మరోవైపు కృష్ణాష్టమి కూడా తోడవడంతో వ్యవసాయ క్షేత్రంలోని ఉట్టి కొట్టారు జేడి లక్ష్మీనారాయణ. రైతులతో కలిసి ఆట పాటలల్లో పాల్గొన్నారు.పిల్లలకి వ్యవసాయం అంటే ఏమిటో నేర్పించాలి.. నారు మడి, వరి చేను, నాట్లు ఎలా వేస్తాం, తదితరు విషయాలను స్కూల్ పిల్లలకు తెలియజేసేందుకు, ప్రాక్టికల్ గా చూపించేందుకు ఈ వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేసినట్లు చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ.
నేటి తరం పిల్లలకు బియ్యం ఎలా తయారవుతుందో తెలియకపోవటం చాలా బాధాకరమని వారి చైతన్యం కలిగించేందుకే తాను ఇలా రైతులా మారినట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం వంటి విషయాలు తెలియజేసేందుకు ఇదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా భూమి భారతి అన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram