Turkey Earthquake | 3 రోజుల ముందే హెచ్చ‌రించిన ప‌రిశోధ‌కుడు

Turkey Earthquake | ట‌ర్కీ, జోర్డాన్, సిరియా, లెబ‌నాన్‌లో భారీ భూకంపం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మూడు రోజుల ముందే ఓ ప‌రిశోధ‌కుడు హెచ్చ‌రించాడు. నెద‌ర్లాండ్స్ సంస్థ పోలార్ సిస్ట‌మ్ జియోమెట్రీ స‌ర్వేకు చెందిన భూగ‌ర్భ‌శాస్త్ర ప‌రిశోధ‌కుడు ఫ్రాంక్ హుగ‌ర్ బీట్స్.. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఓ ట్వీట్ చేశారు. త్వ‌ర‌లోనే ట‌ర్కీ, సిరియా, జోర్డాన్, లెబ‌నాన్‌ల‌లో భూకంపం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 7.5 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని కూడా పేర్కొన్నారు. ఫ్రాంక్ […]

Turkey Earthquake | 3 రోజుల ముందే హెచ్చ‌రించిన ప‌రిశోధ‌కుడు

Turkey Earthquake | ట‌ర్కీ, జోర్డాన్, సిరియా, లెబ‌నాన్‌లో భారీ భూకంపం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మూడు రోజుల ముందే ఓ ప‌రిశోధ‌కుడు హెచ్చ‌రించాడు. నెద‌ర్లాండ్స్ సంస్థ పోలార్ సిస్ట‌మ్ జియోమెట్రీ స‌ర్వేకు చెందిన భూగ‌ర్భ‌శాస్త్ర ప‌రిశోధ‌కుడు ఫ్రాంక్ హుగ‌ర్ బీట్స్.. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన ఓ ట్వీట్ చేశారు. త్వ‌ర‌లోనే ట‌ర్కీ, సిరియా, జోర్డాన్, లెబ‌నాన్‌ల‌లో భూకంపం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 7.5 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని కూడా పేర్కొన్నారు.

ఫ్రాంక్ ఫిబ్ర‌వ‌రి 3న ట్వీట్ చేయ‌గా, 6వ తేదీనే స‌రిగ్గా మూడు రోజుల త‌ర్వాత ట‌ర్కీ, సిరియాను భూకంపం కుదిపేసింది. 7.5 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌విస్తుంద‌ని ఫ్రాంక్ అంచ‌నా వేశారు. కానీ ఆయ‌న చెప్పిన దాని కంటే ఎక్కువ‌(7.8) తీవ్ర‌త‌తోనే భూకంపం సంభ‌వించింది.

ట‌ర్కీ, సిరియాలో సంభ‌వించిన భూకంపాలు త‌న‌ను ఎంతో క‌లచివేశాయ‌ని ఫ్రాంక్ నిన్న పేర్కొన్నారు. గ్ర‌హ సంబంధిత సంక్లిష్ట రేఖాగ‌ణితం ఆధారంగా భూకంపం వ‌చ్చే స‌మ‌యాన్ని అంచ‌నా వేసిన‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే మ‌రిన్ని భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని ఫ్రాంక్ చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే మ‌ధ్యాహ్నం, సాయంత్రం స‌మ‌యాల్లో కూడా ట‌ర్కీ, సిరియాను భూంకంపాలు కుదిపేశాయి.

అయితే ఫ్రాంక్ ట్వీట్ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. భూకంపాల‌ను అంచ‌నా వేసేందుకు క‌చ్చిత‌మైన విధానం ఏది అందుబాటులో లేదంటూ కొంద‌రు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో ఫ్రాంక్ అంచ‌నాలు త‌ప్పాయ‌ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఫ్రాంక్ అంచ‌నాలు నిజం కావ‌డంతో ఆయ‌న ట్వీట్ల‌ను నెటిజ‌న్లు షేర్ చేస్తున్నారు.