Hyderabad | నీలి చిత్రాల్లో నటిస్తే.. లక్షలు వస్తాయని

Hyderabad | పంజాగుట్ట పోలీసులను ఆశ్ర‌యించిన బాధితురాలు విశాఖపట్ననికి చెందిన వివాహితను ఓ కేటుగాడు మోసం చేశారు. దీనికి సంబంధించి బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివ‌రాల మేర‌కు.. విశాఖపట్నంకు చెందిన వివాహిత దిల్‌షుక్‌న‌గర్ లో నివాసం ఉంటోంది. వివాహ వేడుకల ఏర్పాట్లు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వివాహితకు నాలుగేళ్ల క్రితం బోనాల చెన్నకేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్ప‌డింది. నెల రోజుల క్రితం బాధితురాలి ఫోన్ చేసిన చెన్నకేశవ, […]

  • By: krs    latest    Aug 05, 2023 5:41 PM IST
Hyderabad | నీలి చిత్రాల్లో నటిస్తే.. లక్షలు వస్తాయని

Hyderabad |

పంజాగుట్ట పోలీసులను ఆశ్ర‌యించిన బాధితురాలు

విశాఖపట్ననికి చెందిన వివాహితను ఓ కేటుగాడు మోసం చేశారు. దీనికి సంబంధించి బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివ‌రాల మేర‌కు.. విశాఖపట్నంకు చెందిన వివాహిత దిల్‌షుక్‌న‌గర్ లో నివాసం ఉంటోంది.

వివాహ వేడుకల ఏర్పాట్లు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వివాహితకు నాలుగేళ్ల క్రితం బోనాల చెన్నకేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్ప‌డింది. నెల రోజుల క్రితం బాధితురాలి ఫోన్ చేసిన చెన్నకేశవ, తనకు తెలిసిన. వెబ్సైట్ వాళ్ళు ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని నీలి చిత్రాల్లో నటిస్తే పది లక్షలు ఇస్తారని న‌మ్మించాడు.

ఆర్థిక అవసరాల రిత్యా నటించడానికి సరే అన్న బాధితురాలను పంజాగుట్ట లోని హోటల్ రూముకు పిలిపించిన చెన్నకేశవ.. కూల్‌డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.

బాధితురాలు మత్తులోకి జారుకున్నాక నగ్నంగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయ‌డంతో బాధితురాలు విసిగిపోయింది. వేధింపులు ఎక్కువ కావడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.