Varupula Raja | అధికార లాంఛనాలు ఎందుకబ్బా.. వరుపుల వర్గీయులను ఆకట్టుకోవడమే లక్ష్యమా !!
విధాత: ఇటీవల ప్రముఖుల మరణాలు.. అంత్యక్రియలు(funeral) విషయంలో పలు సంశయాలు.. సందేహాలు వస్తున్నాయి. మాజీ మంత్రులు ఈ గౌరవం దక్కుతుంది. అది కేసుకుండా..ఏదైనా రంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారు క్షన్నుమూస్తే వారికి గౌరవ సూచకంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారు.. ఈ విషయంలోనూ ప్రభుత్వాలు ఒకొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటున్నాయి. విశ్వనాథ్(Vishwanath).. జమున(Jamuna) వంటివారిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ […]
విధాత: ఇటీవల ప్రముఖుల మరణాలు.. అంత్యక్రియలు(funeral) విషయంలో పలు సంశయాలు.. సందేహాలు వస్తున్నాయి. మాజీ మంత్రులు ఈ గౌరవం దక్కుతుంది. అది కేసుకుండా..ఏదైనా రంగంలో లబ్ధ ప్రతిష్టులైన వారు క్షన్నుమూస్తే వారికి గౌరవ సూచకంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారు.. ఈ విషయంలోనూ ప్రభుత్వాలు ఒకొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటున్నాయి. విశ్వనాథ్(Vishwanath).. జమున(Jamuna) వంటివారిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసిన విషయం అందరికి తెలిసిందే.
ఇక నిన్న ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న వరుపుల రాజా (Varupula Raja) గుండెపోటుతో మరణించగా ఆయన్ను ప్రభుత్వ లాంఛనాల(Government formalities)తో సాగనంపారు. ఎలాంటి పదవులు చేపట్టకపోయినా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఎందుకు అనేది చర్చకు వచ్చింది.
రాజా కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గమంతా జనసేన పార్టీతో నడుస్తుందనే అంటున్నారు. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడానికే జగన్ ప్రభుత్వం వరుపుల రాజాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని అంటున్నారు.
అందరితో మంచిగా ఉండే రాజా మరణించిన వెంటనే టీడీపీ నేతల కన్నా వైసీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు(MLA Kannababu), కాకినాడ ఎంపీ వంగా గీత(MP Vanga Geetha), పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజా(MLA Pendem Dorababu Raja) భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మళ్లీ అందులోనూ వంగా గీత, కన్నబాబు, పెండెం దొరబాబు వీళ్లంతా కాపు నేతలే కావడం గమనార్హం. కాపులను మళ్ళీ మచ్చిక చేసుకునేందుకు ఇలా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారని పలుపురు అనుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram