Gaddar | గద్దర్ చుట్టూ రాజకీయ విష వలయం సరైనది కాదు: ధర్మార్జున్
Gaddar విధాత: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణాంతరం బీఆరెస్ నేతలు చేస్తున్న వితండ వాదన బాధ్యతారహిత్య మైన ప్రవర్తన ప్రజలను కలచి వేస్తుందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు గద్దర్ తన జీవితకాలం ప్రజల పక్షాన నిలబడి పాలకవర్గ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఎన్నికల అవకాశవాద దోరణులను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. గద్దర్ మొదటి నుంచి కేసీఆర్ విధానాలను నిరసిస్తూనే ఉన్నాడన్నారు. తెలంగాణ […]
Gaddar
విధాత: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణాంతరం బీఆరెస్ నేతలు చేస్తున్న వితండ వాదన బాధ్యతారహిత్య మైన ప్రవర్తన ప్రజలను కలచి వేస్తుందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు గద్దర్ తన జీవితకాలం ప్రజల పక్షాన నిలబడి పాలకవర్గ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ ఎన్నికల అవకాశవాద దోరణులను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. గద్దర్ మొదటి నుంచి కేసీఆర్ విధానాలను నిరసిస్తూనే ఉన్నాడన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాట పక్షంగానే మిగిలాడని ధర్మార్జున్ అన్నారు.
ఇటీవల తెలంగాణ జన సమితి నిర్వహించిన తెలంగాణ బచావో సదస్సులో పాల్గొని కేసీఆర్ గద్దె దింపేంతవరకు ఈ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఎవరైనా చనిపోయినప్పుడు సంతాపం తెలపడం పార్థివ దేహాన్ని సందర్శించడం వారి వారి వ్యక్తిగత విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ, గద్దర్ శవం సాక్షిగా పేలాలు ఏరుకోవాలని బిఆర్ఎస్ చూస్తుందన్నారు.
గద్దర్ పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచేంతవరకు కొంతమంది వ్యక్తుల పాత్ర చొరవ అభినందనీయమే కానీ, ఇప్పుడు దాన్ని రాజకీయ అంశంగా చర్చ చేయడానికి తమ ఎన్నికల్లో ప్రయోజనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram