Chandrababu | గద్దర్‌పై కాల్పుల్లో నా ప్రమేయం లేదు: మాజీ సీఎం చంద్రబాబు
Chandrababu | గద్దర్ కుటుంబానికి పరామర్శ విధాత: గద్దర్‌పై గతంలో జరిగిన కాల్పులలో నా ప్రమేయం లేదని, ఆ కాల్పుల వెనుక నా హస్తం ఉందనడం అపోహలేనని, అదంతా దుష్ప్రచారమని కొట్టి పారేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. మంగళవారం ఆయన గద్దర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గద్దర్ మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చారు. అనంతరం చంద్రబాబు (Chandra Babu) మీడియాతో మాట్లాడుతూ గద్దర్ ఒక వ్యక్తి కాదని, ఆయనొక వ్యవస్థ […]

Chandrababu |
- గద్దర్ కుటుంబానికి పరామర్శ
విధాత: గద్దర్‌పై గతంలో జరిగిన కాల్పులలో నా ప్రమేయం లేదని, ఆ కాల్పుల వెనుక నా హస్తం ఉందనడం అపోహలేనని, అదంతా దుష్ప్రచారమని కొట్టి పారేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. మంగళవారం ఆయన గద్దర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గద్దర్ మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చారు.
అనంతరం చంద్రబాబు (Chandra Babu) మీడియాతో మాట్లాడుతూ గద్దర్ ఒక వ్యక్తి కాదని, ఆయనొక వ్యవస్థ అని అన్నారు. ప్రజాచైతన్యమంటే గద్దర్ పేరు గుర్తుకు వస్తుందని, నిరంతరం ప్రజల కోసం పోరాడారని, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరముందన్నారు.
గద్దర్ లక్ష్యం.. తన లక్ష్యం ఒక్కటేనని, ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. దేనికి భయపడని వ్యక్తి గద్దర్ అని, ఆయన లేని లోటును ఎవరు భర్తీ చేయలేరన్నారు. తెలంగాణ తొలి, మలి దశ పోరాటాలలో గద్దర్ పాత్ర మరువలేనిదన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో తాను చేసిన కృషితో హైద్రాబాద్ ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు.