Ganja Smuggling | గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 90 కిలోల గంజాయి సీజ్
Ganjai Smuggling విధాత: పటాన్ చెరు ముత్తంగి రింగురోడ్డు సమీపంలో ముంబాయికి గంజాయిని తరలిస్తున్న నలుగురు అంతర్ రాష్ట్ర ముఠాపై యాంటి నార్కోటిక్స్ అధికారులు పటాన్ చెరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు . 25 లక్షల విలువ చేసే ఎండు గంజాయిని, స్యాంట్రో కారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూర్ ఎస్పీ చక్రవర్తి మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల వ్యవసాయ పొలాల్లో […]
Ganjai Smuggling
విధాత: పటాన్ చెరు ముత్తంగి రింగురోడ్డు సమీపంలో ముంబాయికి గంజాయిని తరలిస్తున్న నలుగురు అంతర్ రాష్ట్ర ముఠాపై యాంటి నార్కోటిక్స్ అధికారులు పటాన్ చెరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు . 25 లక్షల విలువ చేసే ఎండు గంజాయిని, స్యాంట్రో కారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూర్ ఎస్పీ చక్రవర్తి మీడియాకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల వ్యవసాయ పొలాల్లో గంజాయిని సాగు చేసి ముంబైకి స్యాంట్రో కారులో సరఫరా చేస్తుండగా 90 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులు రాజారావు(35), వంతల బాబ్జీ(25), అనుపోజు సాయి శివ కుమార్ (28), రాథోడ్ వెంకట్ (34) లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram