Gautam Adani | ప్రపంచ కుబేరుల జాబితాలో 38వ స్థానానికి అదానీ..
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ సోమవారం ప్రపంచ కుబేరుల జాబితాలో 38వ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ ఆస్తులు కరిగిపోతున్నాయి. జనవరి 24న ఈ జాబితాలో ఆయన రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన సందప 120 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 2021 తర్వాత ఆయన సంపదలో అత్యల్ప స్థాయికి చేరింది. దాదాపు […]
Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ సోమవారం ప్రపంచ కుబేరుల జాబితాలో 38వ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ ఆస్తులు కరిగిపోతున్నాయి. జనవరి 24న ఈ జాబితాలో ఆయన రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన సందప 120 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 2021 తర్వాత ఆయన సంపదలో అత్యల్ప స్థాయికి చేరింది.
దాదాపు 33 రోజుల్లో కంపెనీల వాటాలు 85శాతం తగ్గాయి. షేర్ల విలువ అసలు విలువ కంటే 85శాతం ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ సమయంలో ఆగస్ట్ 2021 తర్వాత మొదటిసారిగా.. అదానీ మొత్తం 10 కంపెనీల షేర్ల మూలధనం హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు ముందు 19.20 లక్షల కోట్లుగా ఉండగా.. రూ.6.82 లక్షల కోట్లకు తగ్గింది. కంపెనీల్లో 12.19 లక్షల కోట్లకి పైగా టీఎస్‌ఎస్ క్షీణించింది. ఇదిలా ఉండగా.. గత 33 రోజుల్లో 87 బిలియన్ డాలర్ల సంపద కరిగిపోయాయి.
అదానీ గ్రూప్ స్టాక్‌లో ఒక అదానీ పోర్ట్స్ మినహా మిగతా అన్ని షేర్లు పడిపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 9.17 శాతం, అదానీ పోర్ట్ 0.53శాతం, అదానీ పవర్ 4.97 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 4.99 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.99 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5శాతం, అదానీ విల్మార్ 5 శాతం, అక్ సిమెంట్ 1.95 శాతం, అంబుజా సిమెంట్ 4.50 శాతం, ఎన్డీటీవీ 4.98 శాతం పడిపోయాయి. మరో వైపు అదానీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగానే పతనమయ్యాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram