రాజ‌కీయ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించండి.. జేపీ న‌డ్డాకు గంభీర్ ట్వీట్

భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గౌతమ్ గంభీర్ కీల‌క ట్వీట్ చేశారు. త‌న‌ను రాజ‌కీయ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు

రాజ‌కీయ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించండి.. జేపీ న‌డ్డాకు గంభీర్ ట్వీట్

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గౌతమ్ గంభీర్ కీల‌క ట్వీట్ చేశారు. త‌న‌ను రాజ‌కీయ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. క్రికెట్‌పై దృష్టి సారించేందుకే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. జైహింద్ అంటూ గంభీర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


2019లో బీజేపీలో చేరిన గంభీర్.. ఢిల్లీ బీజేపీలో కీల‌క పాత్ర పోషించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌చ్చ‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఈ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులను ఖ‌రారు చేసేందుకు మోదీ రెండు రోజుల క్రితం పార్టీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏ క్ష‌ణ‌మైనా వంద మందితో కూడిన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.