ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి.. పోటీ నుంచి అశోక్ గెహ్లాట్ ఔట్‌

విధాత‌: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్‌ 17వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ పడడం లేదని అశోక్‌ గెహ్లాట్‌ వెల్లడించారు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసేందుకు రాహుల్ నిరాక‌రించారు. రాహుల్ పోటీ చేయ‌క‌పోతే చేస్తాన‌ని గ‌తంలో చెప్పాను ఇప్పుడు కూడా తాను పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన […]

  • By: Somu    latest    Sep 29, 2022 10:13 AM IST
ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి.. పోటీ నుంచి అశోక్ గెహ్లాట్ ఔట్‌

విధాత‌: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్‌ 17వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ పడడం లేదని అశోక్‌ గెహ్లాట్‌ వెల్లడించారు.

అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసేందుకు రాహుల్ నిరాక‌రించారు. రాహుల్ పోటీ చేయ‌క‌పోతే చేస్తాన‌ని గ‌తంలో చెప్పాను

ఇప్పుడు కూడా తాను పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన ప‌రిణామాల‌తో దిగ్భ్రాంతి చెందాను. ఈ ప‌రిణామాల‌పై సోనియాగాంధీకి క్ష‌మాప‌ణ చెప్పాను.అయితే రాజ‌స్థాన్ సీఎంగా కొన‌సాగేందుకే గెహ్లాట్ మొగ్గుచూపారు.