Ghost Patient | హాస్పిటల్‌లో దయ్యంగా మారిన రోగితో మాట్లాడిన సెక్యూరిటీ గార్డు.. వీడియో
Ghost Patient | విధాత: మీరు ఎప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? అసలు కంటికే కనిపించవు.. దెయ్యాలతో మాట్లాడం ఏంటి? అనే ప్రశ్న మీలో తలెత్తొచ్చు. కానీ కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. అలాంటి వారు దెయ్యాలతో మాట్లాడుతారని అక్కడక్కడ వినే ఉంటాం. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మనకే అర్థమైపోతోంది. అర్జెంటీనాలోని ఓ హాస్పిటల్‌లో రాత్రి విధుల్లో ఓ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఆస్పత్రి ముఖ ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డు కూర్చొని ఉన్నాడు. ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా తన […]

Ghost Patient | విధాత: మీరు ఎప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? అసలు కంటికే కనిపించవు.. దెయ్యాలతో మాట్లాడం ఏంటి? అనే ప్రశ్న మీలో తలెత్తొచ్చు. కానీ కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. అలాంటి వారు దెయ్యాలతో మాట్లాడుతారని అక్కడక్కడ వినే ఉంటాం. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మనకే అర్థమైపోతోంది.
అర్జెంటీనాలోని ఓ హాస్పిటల్‌లో రాత్రి విధుల్లో ఓ సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఆస్పత్రి ముఖ ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డు కూర్చొని ఉన్నాడు. ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా తన కుర్చీలో నుంచి ముందుకు వెళ్తాడు ఆ సెక్యూరిటీ గార్డ్. ఇక ఏదో మాట్లాడుతున్నాడు. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ దెయ్యంతో మాట్లాడినట్లు అర్జెంటీనా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎందుకంటే ఈ సెక్యూరిటీ గార్డు మాట్లాడిన ఒక రోజు ముందు.. అదే ఆస్పత్రిలో ఓ రోగి చనిపోయాడు. అదే రోగి దెయ్యం రూపంలో మళ్లీ ఆస్పత్రికి వచ్చాడని, సెక్యూరిటీ గార్డు మాట్లాడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో ఆస్పత్రి సెన్సార్ డోర్లు కూడా తెరుచుకున్నాయి. కానీ ఎవరూ రాలేదు. దెయ్యమే ఆస్పత్రిలోకి వచ్చిందని స్థానికులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.