Lovers | ప్రియుడితో ఏకాంతంగా గ‌డిపేందుకు.. గ్రామంలో రోజూ క‌రెంట్ క‌ట్..

Lovers | ప్రియుడితో ఏకాంతంగా గ‌డిపేందుకు ఓ యువ‌తి చాలా తెలివి ప్ర‌ద‌ర్శించింది. గ్రామ ప్ర‌జ‌ల కంట ప‌డ‌కుండా అత‌న్ని క‌లవాల‌నుకుంది. ఇందుకు పెద్ద ప్లాన్ ర‌చించింది. ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యంలో క‌రెంట్ క‌ట్ చేసి గ్రామాన్ని అంధకారం చేసేది. ఆ త‌ర్వాత మెల్లిగా త‌న ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లి ఏకాంతంగా గ‌డిపేది. అయితే ఓ రోజు గ్రామ‌స్తులు మాటు వేసి ఆ జంట‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బేత‌య్య గ్రామానికి […]

  • Publish Date - July 19, 2023 / 09:04 AM IST

Lovers | ప్రియుడితో ఏకాంతంగా గ‌డిపేందుకు ఓ యువ‌తి చాలా తెలివి ప్ర‌ద‌ర్శించింది. గ్రామ ప్ర‌జ‌ల కంట ప‌డ‌కుండా అత‌న్ని క‌లవాల‌నుకుంది. ఇందుకు పెద్ద ప్లాన్ ర‌చించింది. ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యంలో క‌రెంట్ క‌ట్ చేసి గ్రామాన్ని అంధకారం చేసేది. ఆ త‌ర్వాత మెల్లిగా త‌న ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లి ఏకాంతంగా గ‌డిపేది. అయితే ఓ రోజు గ్రామ‌స్తులు మాటు వేసి ఆ జంట‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బేత‌య్య గ్రామానికి చెందిన ఓ యువ‌తి.. అదే గ్రామంలోని ఓ యువ‌కుడిని ప్రేమిస్తుంది. అయితే ఈ జంట‌కు ఏకాంతంగా గ‌డిపే స‌మ‌యం దొరికేది కాదు. దీంతో ప్రియురాలు తెలివిగా ఆలోచించి, ప్ర‌తి రోజు రాత్రిపూట గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లేది. క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపివేసి, త‌న ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లి ఏకాంతంగా గ‌డిపేది.

నెల‌ల పాటు ప్ర‌తి రోజు ఒకే స‌మయానికి క‌రెంట్ పోవ‌డంతో గ్రామ‌స్తుల‌కు అనుమానం వ‌చ్చింది. దీంతో ఓ రోజు గ్రామ‌స్తులు ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద మాటు వేశారు. యువ‌తి వ‌చ్చి క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిపివేసి, త‌న ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లిన ఘ‌ట‌న‌ను గ‌మ‌నించారు. ఆ జంట‌ను గ్రామ‌స్తులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

ప్రియుడ్ని కొట్టేందుకు గ్రామస్తులు య‌త్నించ‌గా, వారిని ప్రియురాలు అడ్డుకుంది. చివ‌ర‌కు ఆ జంట‌కు పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్ద‌లు ఒప్పుకున్నారు. దీంతో క‌రెంట్ స‌ర‌ఫరా నిలిపివేత కార్య‌క్ర‌మం వారి పెళ్లికి మార్గం సుగ‌మం చేసింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News