Prabhakar Rao: ప్రభాకర్ రావుకు పాస్ పోర్టు ఇవ్వండి : సుప్రీం కోర్టు

Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో కొంత ఊరట దక్కింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు, పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది. ప్రభాకర్ రావు కు పాస్ పోర్టును ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాస్ పోర్టు వచ్చిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరై పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్ధని ఆదేశించింది.
ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వానికి నిర్థేశించింది. తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసిందసి. పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని ప్రభాకర్ రావు పిటిషన్ లోనే వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారించిన సుప్రీం ధర్మాసనం.. ప్రభాకర్ రావుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఇండియాకు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.