వృద్దుడి క‌డుపులో గ్లాస్.. షాకైన డాక్ట‌ర్లు

విధాత: వృద్ధుడి క‌డుపులో గ్లాస్ ఉండ‌టం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇది నిజ‌మే. అత‌ను ఆ గ్లాసును మింగ‌లేదు. కొంత‌మంది దుర్మార్గులు ఆ వృద్ధుడి మ‌ల‌ద్వారం నుంచి గ్లాసును చొప్పించారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చ‌తుఖేడ గ్రామానికి చెందిన రాందాస్ అనే వృద్ధుడు నాలుగు నెల‌ల క్రితం అమ‌వాత అనే గ్రామానికి వెళ్లాడు. అక్క‌డ రాధేశ్యామ్ కుటుంబ స‌భ్యులు రాందాస్‌ను తీవ్రంగా కొట్టారు. బ‌ల‌వంతంగా గ్లాసుపై కూర్చొబెట్టారు. ఆ గ్లాసు […]

వృద్దుడి క‌డుపులో గ్లాస్.. షాకైన డాక్ట‌ర్లు

విధాత: వృద్ధుడి క‌డుపులో గ్లాస్ ఉండ‌టం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇది నిజ‌మే. అత‌ను ఆ గ్లాసును మింగ‌లేదు. కొంత‌మంది దుర్మార్గులు ఆ వృద్ధుడి మ‌ల‌ద్వారం నుంచి గ్లాసును చొప్పించారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. చ‌తుఖేడ గ్రామానికి చెందిన రాందాస్ అనే వృద్ధుడు నాలుగు నెల‌ల క్రితం అమ‌వాత అనే గ్రామానికి వెళ్లాడు. అక్క‌డ రాధేశ్యామ్ కుటుంబ స‌భ్యులు రాందాస్‌ను తీవ్రంగా కొట్టారు. బ‌ల‌వంతంగా గ్లాసుపై కూర్చొబెట్టారు. ఆ గ్లాసు మ‌ల‌ద్వారం ద్వారా వృద్ధుడి క‌డుపులోకి ప్ర‌వేశించింది. సిగ్గుతో ఈ విష‌యాన్ని రాందాస్ ఎవ‌రికీ చెప్ప‌లేదు.

కొద్ది రోజుల నుంచి తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ ప‌డుతున్న రాందాస్.. తిరిగి చ‌తుఖేడ గ్రామానికి చేరుకుని త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై గ్రామ‌స్తుల‌కు చెప్పాడు. అప్పటి నుంచి తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ ప‌డుతున్నాన‌ని తెలిపాడు.

దీంతో గ్రామ‌స్తులు అత‌న్ని ఆస్ప‌త్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కానింగ్ చేసి చూడగా క‌డుపులో ఉన్న గ్లాసును చూసి షాక్‌కు గుర‌య్యారు. క‌డుపులో ఉన్న గ్లాస్‌ను శ‌స్త్ర చికిత్స ద్వారా తొల‌గిస్తామ‌ని డాక్ట‌ర్లు తెలిపి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వృద్ధుడి వాంగ్మూలాన్ని న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.