Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు.. జ‌ర జాగ్ర‌త్త సుమా..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Jan 11, 2026 6:00 AM IST
Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి అనారోగ్య స‌మ‌స్య‌లు.. జ‌ర జాగ్ర‌త్త సుమా..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారి సహాయ సహకారాలతో ఆశించిన ఫలితాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సంఘటనలు ఒత్తిడి కలిగిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సమయస్ఫూర్తితో ఆటంకాలు ఎదుర్కోడానికి ప్రయత్నిస్తే విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. శత్రుబలాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్లారు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం కొనసాగుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. విదేశీయానం సూచన ఉంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా గొప్ప యోగాలున్నాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం. మీ మాటకు ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సరైన ప్రణాళికతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. అనవసర వ్యయాలపై నియంత్రణ అవసరం. కుటుంబ కలహాలు ఆందోళన కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సమస్యలున్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. సానుకూల దృక్పధంతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దల మాటలు గౌరవించడం మంచిది. ఆర్థికంగా మేలైన సమయం. ఖర్చులు పెరిగే సూచన ఉంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ప్రారంభించిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో జాగ్రత్త అవసరం.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. బుద్ధిబలంతో ఉద్యోగంలో ఓ క్లిష్ట సమస్యను పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వ్యాపారులు కీలక పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. కుటుంబం సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. కొత్త కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ వ్యవహారాల్లో సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.