Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మారుతి.. మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్
Raja Saab | ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టినప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కథ, కథనం విషయంలో కొంతమంది ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేయగా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిగా లేరనే మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
Raja Saab | ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టినప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కథ, కథనం విషయంలో కొంతమంది ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేయగా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిగా లేరనే మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు ఒకే ప్రశ్న వేస్తున్నారు. టీజర్‌లో అదిరిపోయేలా కనిపించిన ప్రభాస్ ఓల్డ్ లుక్ అసలు సినిమాలో ఎందుకు లేదన్నదే వారి సందేహం. టీజర్‌లో ఆ లుక్‌తో ప్రభాస్ ఎంట్రీ ఒక రేంజ్‌లో హైలైట్ కావడంతో, ఆ పాత్ర సినిమా మొత్తం కీలకంగా ఉంటుందని అందరూ భావించారు.
కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సన్నివేశాలు కనిపించకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా డిజప్పాయింట్ అయ్యారు. సినిమా మొత్తం అనుకున్నంత ఎంగేజింగ్‌గా లేకపోయినా, కనీసం ఆ పవర్‌ఫుల్ లుక్ ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతీ తాజాగా స్పందించి, ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో షోలు సరైన సమయంలో పడకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నట్లు మారుతీ వెల్లడించారు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పిన ఆయన, ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో ప్రభాస్‌ను అలానే చూపించేందుకు ప్రయత్నించానని అన్నారు. మైండ్ గేమ్ తరహాలో సాగే క్లైమాక్స్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నారని, కామన్ ఆడియన్స్‌కు సినిమా బాగా రీచ్ అయిందనే ఫీడ్‌బ్యాక్ కూడా తనకు వస్తోందని తెలిపారు.
అలాగే ఒక్క షో లేదా ఒక్క రోజుతోనే సినిమాను తేల్చేయొద్దని, కనీసం పది రోజులు ఆగితే రాజాసాబ్ అసలు స్థాయి ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. టీజర్లు, పోస్టర్లలో చూపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ సినిమాల్లో లేకపోవడం వల్ల అభిమానులు నిరాశ చెందారని అంగీకరించిన మారుతీ, ఈరోజు జనవరి 10 సాయంత్రం నుంచి ఆ సన్నివేశాలను సినిమాలో యాడ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఆ సీన్స్ కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారని కూడా ఆయన చెప్పారు. ఈ అదనపు సన్నివేశాలు యాడ్ అయిన తర్వాత సినిమా రన్‌లో ఏమైనా మార్పు వస్తుందా, ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram