బంగారం బాబోయ్‌..! మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలం బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి

  • By: Somu    latest    Dec 15, 2023 12:25 PM IST
బంగారం బాబోయ్‌..! మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Gold Rate | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలం బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా దిగిరావడంతో సామాన్యులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా నిన్న ఒకే రోజు తులానికి రూ.1000 పెరిగింది. తాజాగా శుక్రవారం బులియన్‌ మార్కెట్‌లో మళ్లీ ధర ఎగిసింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1000 పెరిగి.. తులానికి రూ.57,750కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడిపై రూ.1100 తులానికి రూ.63వేలకు పెరిగింది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,300 పలుకుతున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో రూ.22 క్యారెట్ల పుత్తడి రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63వేలకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,150కి పెరిగింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63వేలు పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం మార్కెట్‌లో భారీగానే పెరిగింది. వెండిపై రూ.1000 పెరిగి.. కిలోకు రూ.78,500 ఎగిసింది.


హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,500కి చేరింది. ఇదిలా ఉండగా.. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయం నేపథ్యంలో అంతర్జాతీ మార్కెట్‌లో పసిడి రేటు పది రోజుల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్‌కు 2051 డాలర్లు పలుకుతున్నది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతుందని, దీంతో ధరలు పెరుగుతున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.