సామాన్యులకు ఊరట..! నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

పసడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ధరలు గత మూడురోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి

సామాన్యులకు ఊరట..! నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | పసడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ధరలు గత మూడురోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ తులం రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.63,870 వద్ద నికలడగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,970 వద్ద స్థిరంగా ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,100 ఉండగా.. 24 క్యారెట్ల పసడి రూ.64,470 వద్ద ట్రేడవుతున్నది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,870 వద్ద నిలకడగా ఉన్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,870 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం నిలకడగా ఉన్నది. కిలో ధర రూ.78,600 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80వేలు పలుకుతున్నది.