Gold Rates | మరోసారి బంగారం పైపైకి.. మళ్లీ తులం రూ.63వేలు దాటిన పసిడి..!

బంగారం ధరలు మరోసారి వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. ఆదివారం బులియ‌ న్నిలకడగా కొనసాగిన ధరలు సోమవారం మరోసారి పెరిగాయి

Gold Rates | మరోసారి బంగారం పైపైకి.. మళ్లీ తులం రూ.63వేలు దాటిన పసిడి..!

Gold Rates | బంగారం ధరలు మరోసారి వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. ఆదివారం బులియ‌ న్నిలకడగా కొనసాగిన ధరలు సోమవారం మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.100 పెరిగి రూ.57,800కు పెరిగింది. 24 క్యారెట్ల పసిడి సైతం రూ.100 పెరిగి రూ.63,050కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,760కి పెరిగింది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,050కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,200కి పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,050 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే, వెండి ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. రూ.200 చొప్పున పెరిగిన తులం రూ.76,200కి పెరిగింది.


హైదరాబాద్‌లో బంగారం ధర కిలోకు రూ.77,700 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.