మగువలకు షాక్‌..! మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మగువలకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. నిన్నా మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి

  • By: Somu |    latest |    Published on : Jan 03, 2024 4:26 AM IST
మగువలకు షాక్‌..! మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold Rates | మగువలకు బంగారం ధరలు షాక్‌ ఇచ్చాయి. నిన్నా మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 పెరిగి తులం రూ.58,750కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి తులం రూ.64,090కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లోనూ బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.58,900 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.64,240కి చేరింది.



ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,090కి ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.64,580కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,750గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,090 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి రూ.78,900 ఉండగా.. హైదరాబాద్‌లో రూ.80,300 వద్ద ట్రేడవుతున్నది.