Gold Rate | మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంత ఉందంటే..?

Gold Rate | నిన్న మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారంపై రూ.100 దిగి వచ్చింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గగా.. వెండి ధర సైతం పతనమైంది. అమెరికన్‌ డాలర్‌ బలహీనపడడంతో బంగారం ధరలు రెండు నెలల కనిష్టం నుంచి తిరిగి కోలుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 1979 డాలర్లు పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 […]

  • By: Vineela |    latest |    Published on : Jun 02, 2023 4:50 AM IST
Gold Rate | మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంత ఉందంటే..?

Gold Rate | నిన్న మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారంపై రూ.100 దిగి వచ్చింది.

అదే సమయంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గగా.. వెండి ధర సైతం పతనమైంది. అమెరికన్‌ డాలర్‌ బలహీనపడడంతో బంగారం ధరలు రెండు నెలల కనిష్టం నుంచి తిరిగి కోలుకుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 1979 డాలర్లు పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.60,630 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,920 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ.60,490 వద్ద పలుకుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ.60,490 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలంతటా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్వల్పం తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,500 పలుకుతున్నది.