Gold Rate | కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..!

Gold Rate | దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులకు వరుసగా రెండోరోజు షాక్‌ ఇచ్చాయి. శనివారం స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. ఆదివారం సైతం ధరలు పైకి కదిలాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.210 వరకు పైకి కదిలింది. మరో వైపు కిలో వెండిపై రూ.300 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.60,310కి […]

Gold Rate | కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..!

Gold Rate | దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులకు వరుసగా రెండోరోజు షాక్‌ ఇచ్చాయి. శనివారం స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. ఆదివారం సైతం ధరలు పైకి కదిలాయి.

22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.210 వరకు పైకి కదిలింది. మరో వైపు కిలో వెండిపై రూ.300 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.60,310కి చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.60,600కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,160కి చేరింది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,160 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,160గా ఉన్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500 పలుకుతున్నది.