Gold Increased: పసిడి దూకుడు..పరేషాన్ లో కొనుగోలుదారులు
బులియన్ మార్కెట్ లో మరోసారి పసిడి, వెండి ధరలు పరుగు పెడుతున్నాయి. తులం బంగారంపై మూడు రోజుల్లో రూ.5,670పెరిగింది. వెండి కిలో రూ.6000పెరిగి రూ.1,08,000కుచేరుకుంది.

Gold Increased: బులియన్ మార్కెట్ లో మరోసారి పసిడి, వెండి ధరలు పరుగు పెడుతున్నాయి. తులం బంగారంపై మూడు రోజుల్లో రూ.5,670పెరిగింది. వెండి కిలో రూ.6000పెరిగి రూ.1,08,000కుచేరుకుంది. శుక్రవారం బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్లకు రూ.1850పెరిగి రూ.87,450కి చేరింది. 24క్యారెట్లపై రూ.2020పెరిగి రూ.95,400కు చేరింది. బెంగుళూరు, చెన్నై, ముంబైలో అదే ధరలు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,600, 24క్యారెట్లకు రూ. 95,550గా ఉంది. దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.83,840, 24క్యారెట్లకు రూ.90,514గా, అమెరికాలో 22క్యారెట్లకు రూ.82,573, 24క్యారెట్లకు రూ.87,949గా ఉంది.
మార్కెట్ లో వెండి ధరలు కూడా పెరుతునే ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 1000పెరిగి రూ.1,08,000 చేరుకుంది. పెరిగిన బంగారం, వెండి ధరలతో కొనుగోలు దారులు పరేషాన్ అవుతున్నారు.