Gold: బంగారం ధర.. మళ్లీ పైపైకి..!
బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. పెరిగిన గోల్డ్ రేటు కారణంగా శుక్రవారం 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ.83, 400కి చేరుకుంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.90,980 వద్ద నిలిచాయి.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది. దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు (10గ్రా 22 క్యారెట్స్), రూ.91,130 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల ప్రకటన నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
దుబాయ్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 79,968గా, 24క్యారెట్ల ధర రూ.86,322గా ఉంది. అమెరికాలో 22క్యారెట్ల తులం రేటు రూ. 79,181, 24క్యారెట్ల ధర 84,317గా ఉంది.
వెండి ధరలు (Silver Price):
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ రోజు (మార్చి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,14,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,05,000 వద్దనే ఉంది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram