Gold Rates: నిలకడగా బంగారం ధరలు

Gold Rates: నిలకడగా బంగారం ధరలు

Gold Rates: బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.90,050గా ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 98,240గా ఉంది. చైన్నై, బెంగుళూర్, ముంబాయిలలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో రూ.90.200, రూ.98,340గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.85,938, 24క్యారెట్లకు రూ.92,795గా ఉంది. అమెరికాలో రూ.85,802, రూ.91,351గా ఉంది.

బంగారం ధరలు ఒక దశలో లక్ష రూపాయలు దాటిన అనంతరం తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధరలు గడచిన నెల రోజులుగా విపరీతంగా పెరిగాయి. తాగా తగ్గుముఖం పట్టడానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమంటున్నారు నిపుణులు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల పైన విధించినటువంటి దిగుమతి సుంకాలపై ఆయా దేశాలతో చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. ఫలితంగా స్టాకు మార్కెట్లలో లాభాలు ఊపందుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు ఫలితంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం వచ్చిన తగ్గుదల స్వల్పకాలికమైనవంటున్నారు నిపుణులు.

బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన ఆభరణాల కొనుగోలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని బంగారు ఆభరణాల దుకాణాల వారు చెబుతున్నారు. గత ఏడాది అక్షయ తృతీయతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 30 వేల రూపాయలు పెరిగింది. దీంతో ఈ అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు తగ్గవచ్చని భావిస్తున్నారు.

వెండి ధరలు సైతం నిలకడగానే కొనసాగుతున్నాయి. క్రితం రోజు ధర వద్ధనే ఆగాయి. కిలో వెండి రూ.1,10,900గా ఉంది.