Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు !

Reported by: Y.V. Narsimha Reddy | latest | Apr 29, 2025, 12:08 pm IST
Read Time: 2 mins
Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు !

Gold Prices : హెచ్చుతగ్గుల మధ్య దోబుచులాడుతున్న బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.89,900గా ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.97,970గా ఉంది. బెంగుళూర్, చెన్నైలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.89,950, 24క్యారెట్లకు రూ.98,120గా ఉంది. ముంబైలో రూ.89,800, రూ.97,970గా ఉంది.

దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.85,743, 24క్యారెట్లకు రూ.92,588గా ఉంది. అమెరికాలో రూ.86,074, రూ.91,613గా ఉంది.

వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 1,11,000గా కొనసాగుతోంది.