Gold Rate | అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన బంగారం ధరలు.. దేశంలో నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఔన్స్‌కు 1918 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఇక భారత్‌లో బంగారం ధరల్లో సోమవారం మారలేదు. తులం 22 క్యారెట్ల బంగారం రూ.54,100 కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం 59,020 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,250 ఉండగా.. […]

Gold Rate | అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన బంగారం ధరలు.. దేశంలో నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం ఔన్స్‌కు 1918 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఇక భారత్‌లో బంగారం ధరల్లో సోమవారం మారలేదు. తులం 22 క్యారెట్ల బంగారం రూ.54,100 కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం 59,020 వద్ద కొనసాగుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పుత్తడి రూ.59,170 వద్ద కొనసాగుతున్నది. చెన్నై నగరంలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,450 వద్ద ట్రేడవుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,020 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.54,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,020 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలోకు రూ.73,500 పలుకుతున్నది.