రైతులకు గుడ్‌న్యూస్‌.. రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.6385కోట్లు! ఏ పథకానికి ఎంతంటే!

విధాత : తెలంగాణ ప్రభుత్వ రైతులకు శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌ను నిధులు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు.. ఇందులో రుణమాఫీ కోసం రూ.6385కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.26,831 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బీసీ సంక్షేమ శాఖకు 6229 కోట్లు, రైతుబంధుకు రూ.1575 […]

రైతులకు గుడ్‌న్యూస్‌.. రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.6385కోట్లు! ఏ పథకానికి ఎంతంటే!

విధాత : తెలంగాణ ప్రభుత్వ రైతులకు శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌ను నిధులు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు.. ఇందులో రుణమాఫీ కోసం రూ.6385కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.26,831 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బీసీ సంక్షేమ శాఖకు 6229 కోట్లు, రైతుబంధుకు రూ.1575 కోట్లు, రైతుబీమాకు రూ.1589 కోట్లు, విద్యుత్ సబ్సిడీ రూ.12వేల కోట్లు, ఆయిల్‌పామ్‌కు రూ.1000కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

బడ్జెట్‌ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగం అభివృద్ధి ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుందన్నారు. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దిశానిర్దేశం చేస్తుందన్నారు.

గతంలో సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయరంగానికి తిరిగి జవజీవాలను అందించడంలో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం సఫలమైందన్నారు. గతంలో కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించిందన్నారు.

పథకాల వారీగా నిధులు..

  • కల్యాణలక్ష్మి – రూ.2000 కోట్లు
  • బియ్యం సబ్సిడీ – రూ.2000 కోట్లు
  • కెసీఆర్ కిట్ – రూ.200 కోట్లు
  • ఆసరా పెన్షన్లు – రూ.12000 కోట్లు
  • స్కాలర్షిప్‌ల కోసం – రూ.5609 కోట్లు
  • పల్లె ప్రగతి పట్టణ ప్రగతి – రూ.4834 కోట్లు
  • డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం- రూ.12000 కోట్లు
  • ఆరోగ్యశ్రీ – రూ.1463 కోట్లు
  • ఎస్‌డీఎఫ్‌ – రూ.10348 కోట్లు
  • జీడీఎఫ్‌ – రూ.800 కోట్లు
  • ఇరిగేషన్ – రూ.10014 కోట్లు
  • దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు..
  • ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు
  • దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
  • ఎస్పీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు
  • గ్రామాల్లో రోడ్ల కోసం రూ.2వేల కోట్లు.
  • ఆర్ అండ్ బీ రోడ్ల కోసం రూ.2,500 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ. 4037 కోట్లు
  • హోంశాఖకు రూ. 9599 కోట్లు
  • కొత్త ఉద్యోగాల వేతనాల కోసం రూ. 1000 కోట్లు