రైతుల‌కు శుభ‌వార్త‌.. రూ. 90 వేల వ‌ర‌కు ఉన్న రుణాలు మాఫీ

విధాత‌: తెలంగాణ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2023-24 బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించ‌గా, రైతుల రుణాల మాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించిన‌ట్లు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. అయితే సోషియో ఎకాన‌మిక్ స‌ర్వే విడుద‌ల సంద‌ర్భంగా.. హ‌రీశ్‌రావు ఈ రుణ‌మాఫీకి సంబంధించి స్ప‌ష్ట‌త ఇచ్చారు. రూ. 90 వేల వ‌ర‌కు ఉన్న రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక బ‌డ్జెట్‌లో రైతు […]

రైతుల‌కు శుభ‌వార్త‌.. రూ. 90 వేల వ‌ర‌కు ఉన్న రుణాలు మాఫీ

విధాత‌: తెలంగాణ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2023-24 బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించ‌గా, రైతుల రుణాల మాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయించిన‌ట్లు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. అయితే సోషియో ఎకాన‌మిక్ స‌ర్వే విడుద‌ల సంద‌ర్భంగా.. హ‌రీశ్‌రావు ఈ రుణ‌మాఫీకి సంబంధించి స్ప‌ష్ట‌త ఇచ్చారు. రూ. 90 వేల వ‌ర‌కు ఉన్న రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇక బ‌డ్జెట్‌లో రైతు బంధు ప‌థ‌కానికి కూడా రూ. 275 కోట్లు అధికంగా కేటాయించామ‌ని పేర్కొన్నారు. రైతు బీమా ప‌థ‌కానికి రూ. 123 కోట్లు పెరిగాయ‌ని తెలిపారు. స్కాల‌ర్‌షిప్స్‌, మెస్‌ నిధుల‌ను రూ. 4,690 కోట్ల నుంచి రూ. 5,609 కోట్ల‌కు పెంచామ‌ని తెలిపారు. గ‌తేడాదితో పోల్చితే మొత్తంగా రూ. 919 కోట్ల నిధులు పెరిగాయ‌న్నారు. రాష్ట్రంలోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల్లో హాస్ట‌ల్స్ సౌక‌ర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. నూత‌న హాస్ట‌ళ్ల నిర్మాణానికి, ఆధునీక‌ర‌ణ‌కు ఈ బ‌డ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించామ‌న్నారు.

గృహ నిర్మాణ శాఖ ఆర్ అండ్ బీలో విలీన‌మైంద‌న్న మంత్రి.. ఆర్ అండ్ బీ విభాగంలో హౌసింగ్ కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సొంత స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించాల‌నుకునే వారికి ఈ నిధులు కేటాయిస్తాం. సొంత జాగ‌లో ఇండ్లు నిర్మించుకునేవారికి రూ. 3 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తాం అని మంత్రి స్ప‌ష్టం చేశారు. రూ. 12 వేల కోట్లకు, డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు కేటాయించిన నిధుల‌తో ఎలాంటి సంబంధం లేద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్ట‌త‌నిచ్చారు.