Google | గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచైకి ఆ సంస్థలోని 1400 మంది ఉద్యోగులు బహిరంగ లేఖ రాశారు. ‘చెడుగా ఉండొద్దు’ అంటూ లేఖలో కోరారు. కంపెనీ నుంచి తమ సహోద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తొలగింపుల ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక మార్గాలను సీఈవోకు చూపారు. అలాగే కొన్ని డిమాండ్లను ఆయన ముందుంచి.. బహిరంగ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల తొలగింపు నేపథ్యంలో చాలా […]
Google | గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచైకి ఆ సంస్థలోని 1400 మంది ఉద్యోగులు బహిరంగ లేఖ రాశారు. ‘చెడుగా ఉండొద్దు’ అంటూ లేఖలో కోరారు. కంపెనీ నుంచి తమ సహోద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తొలగింపుల ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక మార్గాలను సీఈవోకు చూపారు. అలాగే కొన్ని డిమాండ్లను ఆయన ముందుంచి.. బహిరంగ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల తొలగింపు నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు తమ పరిస్థితిని మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తలను సైతం గూగుల్ ఏకకాలంలో ఉద్యోగాలను తొలగించడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఒకరిమొఖాలు ఒకరు చూసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఈవోకు రాసిన లేఖలో ఉద్యోగులు రిట్రెంచ్మెంట్ వరకు కొత్త రిక్రూట్మెంట్లను నిలిపివేయాలని సూచించారు. అలాగే ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించే ముందు స్వచ్ఛందంగా వెళ్లేలా చూడాలని లేదంటే ఇతర ఉద్యోగులకు పని గంటలు తగ్గించాలని, ఇందుకోసం వారి అభిప్రాయం తీసుకోవాలని ఉద్యోగులు సూచించారు.
అంతర్గత బదిలీల ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యోగం కోసం వారిని మళ్లీ ఇంటర్వ్యూ చేయొద్దని సూచించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తే వారికి సరైన పరిహారం ఇవ్వాలని కోరారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, వీసా ప్రభావితమైతే అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించవద్దని, ఫలితంగా అస్థిరమైన పరిస్థితి తిరిగి దేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రసూతి వంటి ఉద్యోగుల ప్రీపెయిడ్ సెలవులు తదితర విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.